తన తల్లి అనారోగ్యంతో చనిపోయిందని మనోవేదనకు గురైన ఓ యువతి సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ఎడ్లపల్లీ గ్రామంలో చోటుచేసుకుంది. కొయ్యుర్ పోలీసుల పూర్తి కథనం ప్రకారం ఎడ్లపల్లీ గ్రామానికి చెందిన మంథని సౌమ్య (19) అనే యువతి తల్లి ఎనిమిది నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి సౌమ్య మానసికంగా ఆలోచిస్తూ మనోవేదనకు గురై సోమవారం గడ్డి మందు తాగడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలు తండ్రి మంథని దుర్గయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ తెలిపారు.