యువ చంద్రోద‌యం

టెక్నాలజీ రంగంలో మనిషి ఎన్నో అద్భుతాలు సష్టిస్తున్నాడు. నిత్యం కొత్త ఆవిష్కరణలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అంతరిక్ష రహస్యాలు ఛేదించే దిశలొ ఎన్నో ప్రయోగాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నాడు. భారతీయ శాస్త్రవేత్తలు అగ్ర రాజ్యాలతో పోటీ పడుతూ.. శాస్త్ర, సాంకేతిక రంగంలో ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నారు. చంద్రుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మూడో మిషన్‌ చంద్రయాన్‌-3 విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. భారత్‌ చంద్రున్ని ముద్దాడింది… జాబిల్లి పై కాలుమోపి చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధృవంలో అడుగుపెట్టిన ప్రపంచంలోనే మొట్ట8మొదటి దేశంగా భారత్‌ అవతరించింది. ప్రపంచ దేశాలు భారత్‌కు, ఇస్రోకు అభినందనలు తెలుపుతున్నాయి. చంద్రయాన్‌ 3ని విజయగాథగా మార్చేందుకు ఇస్రో విజ్ఞానమే చాలా కీలకం. నిపుణులు, శాస్త్రవేత్తలందరి మధ్య ఈ ప్రాజెక్ట్‌లో అతి పిన్న వయసు యువకులు కూడా భాగసామ్యం అయ్యారు. వారిలో మన తెలుగు వారు కూడా పదుల సంఖ్యలో ఉన్నారు. వారి చిరు పరిచయమే ఈవారం జోష్‌…

బాపట్ల జిల్లా నుంచి మానస

విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షితంగా జాబిల్లిపై దిగేలా ఇస్రో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ కీలక శాస్త్రవేత్తల బృందంలో యువ శాస్త్రవేత్త బొల్లు మానస ఒకరు. నాలుగేళ్లుగా శాస్త్రవేత్తలు చేసిన శ్రమ ఫలించి చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను విజయ వంతంగా దించిన తొలి దేశంగా ప్రపంచ పటంలో భారత్‌ను నిలిపి జాతి యావత్తూ గర్వపడేలా చేయడంలో భాగస్వామి అయి మహిళాశక్తి చాటారు. తెలుగు వారికి, ప్రతిభావంతులైన యువతకు గర్వ కారణమయ్యారు. అమృత‌లూరుకు చెందిన బొల్లు మానస కేరళలోని తిరువనంతపురం ఐఎస్‌టీ కళాశాలలో ఏవియానిక్స్‌ చదివారు. ఉద్యోగరీత్యా తల్లిదండ్రులు వనజకుమారి, అనిల్‌కుమార్‌ గుంటూరులో స్థిరపడ్డారు. వారి ప్రోత్సాహంతో శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి సేవ చేయాలని పట్టుదలతో కష్టపడి చదివారు. 2014లో కోర్సు పూర్తయిన వెంటనే బెంగళూరు ఇస్రో శాటిలైట్‌ కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. భర్త పవన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా బెంగళూరులో పనిచేస్తున్నారు. చంద్రయాన్‌-2 ప్రాజెక్టు సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ విభాగంలోనూ ఈమె సేవలందించారు. 2019లో ల్యాండర్‌ చంద్రుడిపై దిగే సమయంలో అదుపు తప్పి కూలిపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఇస్రో శాటిలైట్‌ కేంద్రం నుంచి చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై అడుగు పెట్టే సమయంలో శాస్త్రవేత్తల బృందంతో కలిసి పర్యవేక్షిస్తూ తీవ్ర ఉద్విగతకు గురయ్యారు. చంద్రుడిపై ల్యాండర్‌ విజయవంతంగా దిగగానే సంతోషంతో చప్పట్లు కొట్టారు. నాలుగేళ్ల కష్టం ఫలించినందుకు ఆనందబాష్పాలు రాల్చారు.

కొత్తగూడెం నుంచి జక్కుల సాయి తేజ

చంద్రయాన్‌-3 ప్రయోగంలో రేంజ్‌ ఆపరేషన్‌ విభాగంలో కొత్తగూడెం మధురబస్తీకి చెందిన జక్కుల సాయితేజ(23) పనిచేశారు. దేశాభివద్ధి కర్తవ్యంలో భాగస్వామ్యం కావాలన్న అతని తండ్రి ఆశను నేడు అతడు నిజం చేశాడు. పదవ తరగతిలో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదంలో తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. అయినప్పటికీ, దఢ సంకల్పంతో కష్టాలను ఇష్టంగా ఎదుర్కొని విజయాలను సాధించాడు. మాజీ భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం ఆత్మకథ ”వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌” తండ్రి అతనికి అందించాడు. ఆ పుస్తకం అతని చదవులోనూ, వత్తిపరమైన ప్రయత్నాలలో ప్రేరేపిస్తూనే ఉంది. దగ్గరి బంధువుల సహాయంతో, అతను తన పాఠశాల విద్యను ఇల్లందు ఆధారిత ప్రయివేట్‌ పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌ ఆధారిత ప్రయివేట్‌ సంస్థలో పూర్తి చేశాడు. JEE (అడ్వాన్స్‌డ్‌) పరీక్షలో అద్భుతమైన ఫలితాల ద్వారా IIT- ఢిల్లీలో సీటు సాధించి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ అయ్యాడు. ISRO బెంగళూరు ఆధారిత హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ (HSFC)లో సైంటిస్ట్‌/ ఇంజనీర్‌గా ఎంపికయ్యాడు. ఇస్రో పరిధిలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (శ్రీహరికోట)లో ‘సైంటిస్ట్‌ ఇంజినీరు-సి’ విభాగంలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. ఇస్రో ప్రయోగించిన మంగళయాన్‌ మిషన్‌, 104 శాటిలైట్‌ మిషన్‌, పీఎల్‌వీ సీ-42, జీఎస్‌ఎల్‌వీ, ఆర్‌ఎల్‌వీ-45, చంద్రయాన్‌-2 సహా సుమారు 45 ప్రయోగాల్లో భాగస్వామిగా ఉన్నాడు.
ఉయ్యూరుకు చెందిన చైతన్య
చంద్రయాన్‌-3 ప్రయోగంలో ఉయ్యూరుకు చెందిన యువ శాస్త్రవేత్త మధిర చైతన్య భాగస్వామ్యం ఉంది. ఇస్రో కేంద్రంలో అతడు ‘ఈ’ కేటగిరి విభాగంలో పనిచేస్తున్నాడు. అతడి ప్రాథ మిక, ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం ఉయ్యూరులోని ఫ్లోరా పాఠ శాలలో కొనసా గింది. ఇంటర్‌ చైతన్యలో ఐఐటీ విభాగంలో చదివి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విద్యను త్రివేండ్రంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థలో 2008-12లో పూర్తి చేశారు. ఇస్రో సంస్థ దేశ వ్యాప్తంగా ఇంజినీరింగ్‌ విద్యకు ఎంపిక చేసిన 150 మందిలో చైతన్య ఒకడు. అనంతరం ఇస్రో సంస్థలో ఉద్యోగం పొంది అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. మంగళ్‌ యాన్‌, చంద్రయాన్‌-2, చంద్రయాన్‌-3లోనే కాకుండా పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఎస్‌ఎస్‌ఎల్‌వీ మిషన్స్‌లోని 50 లాంఛింగ్‌ ప్రయోగాల్లో చైతన్య భాగ స్వామ్యమయ్యాడు. చైతన్య తండ్రి వెంకటేశ్వర రావు యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉయ్యూరు శాఖలో డీఎంగా పనిచేస్తున్నారు.

కృష్ణ కుమ్మరి
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన కష్ణ కుమ్మరి చంద్రయాన్‌ – 3 మిషన్‌లో 2 పేలోడ్స్‌ (ఏహెచ్‌వీసీ), (ఐఎల్‌ఎస్‌ఏ)కి డేటా ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌ రాశారు. కూలి పనులు చేస్తూ జీవనం సాగించే ఉండవల్లికి చెందిన లక్ష్మీదేవి, మద్దిలేటి దంపతుల కష్ణ కుమ్మరి. 10 తరగతి వరకు ఉండవల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్న కృష్ణ.. మూడేండ్ల పాటు తిరుపతిలో డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (డీసీఎంఈ) పూర్తి చేశాడు. ఈ-సెట్‌ ర్యాంక్‌ సాధించి హైదరాబాదులో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ చేశారు. కళాశాల ప్లెస్‌మెంట్‌లో భాగంగా టెరా డేటా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థలో మూడున్నర సంవత్సరాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే ఇస్రోలో ఐసీఆర్‌బీ (ఇస్రో సెంట్రలైజడ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్ష) రాసి ఆల్‌ఇండియా 4వ ర్యాంకు సాధించారు. అనంతరం 2018 జనవరిలో సైంటిస్ట్‌ లెవల్‌ ఉద్యోగం (గ్రూప్‌ ‘ఏ’ గెజిడెట్‌ అధికారి) యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ (యూఆర్‌ఎస్‌సీ) / ఇస్రోలో ఓ యూనిట్‌ ల్యాబొరేటరీ ఫర్‌ ఎలక్ట్రో ఆప్టిక్స్‌ సిస్టమ్‌ (ఎల్‌ఈఓఎస్‌) బెంగళూరులో సాధించారు.

కడప జిల్లా నుంచి రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి

రాజంపేట మండలం దిగువబసి నాయుడుగారిపల్లె ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న వై.సుబ్రమణ్యంరెడ్డి, చంద్రకళ దంప తుల తనయుడు రాజేంద్రప్రసాద్‌ రెడ్డి బెంగళూరు ఇస్రోలో సైంటిస్ట్‌గా పని చేస్తూ చంద్రయాన్‌-3 మిషన్‌ (ప్రయోగం)లో పాల్గొన్నారు. చంద్రయాన్‌-3 విజయ వంతం కావడం, ఆ ప్రయోగ బందంలో రాజేంద్ర ప్రసాద్‌ రెడ్డి పాల్గొనడం పట్ల ఆయన స్నేహితులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి తల్లిదండ్రులను పలువురు అభినందిస్తున్నారు. ఎంటెక్‌ పూర్తి అయ్యాక క్వాల్‌ కం కంపెనీ తమ కంపెనీలో ఉద్యోగం ఇచ్చేం దుకు రాజేంద్రప్రసాద్‌ రెడ్డికి 43 లక్షల ప్యాకేజీతో ఆఫర్‌ ఇచ్చింది. అయితే రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి తన మేధస్సును దేశానికి ఉపయో గించాలన్న ఆశయంతో ఆ ఉద్యోగాన్ని తిరస్కరించి సైంటిస్ట్‌ అయ్యారు. సైంటిస్ట్‌ అయ్యాక తాను భాగస్వామ్యం అయిన తొలి ప్రయోగం చంద్రయాన్‌ – 3.

వైఎస్సార్‌ జిల్లా నుంచి చందన
వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన యువ శాస్త్రవేత్త అవ్వారు చందన (26) కూడా భాగస్వామిగా ఉన్నారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2019లో నిర్వహించిన ఐఐఎస్టి పోటీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ శాటిలైట్‌ కేంద్రంలో విక్రమ్‌ ల్యాండర్‌ డిజైనర్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ‘చంద్రయాన్‌ మిషన్‌ లో మూడేండ్లుగా పరిశోధనలు చేస్తున్నారు.

హైదరాబాద్‌ ఉప్పల్‌ నుంచి భరత్‌

చంద్రయాన్‌-3 శాస్త్ర వేత్తల బృందంలో ఉప్పల్‌ కు చెందిన దేవసాని భరత్‌ ఉన్నారు. ఇతను ఇస్రోలో శాస్త్ర వేత్తగా ఆరేళ్లుగా చేస్తున్నారు. చంద్రయాన్‌-3లో టెలీ కమ్యూ నికేషన్‌కు సంబంధించిన సిగలింగ్‌ వ్యవస్థలో నలుగురు సభ్యుల బృందంలో భరత్‌ ఉన్నారు. దేవసాని భరత్‌ ఇంటర్‌ వరకు నగరంలోనే చదివారు. ఐఐటీలో అర్హత సాధించడంతో పలు ఐఐటీలు, ఎన్‌ఐటీలలో సీటు వచ్చింది. వాటిల్లో చేరకుండా ఐసాట్‌ రాసి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ)లో సీటు సాధించారు. ఇస్రోలో ఆరేండ్లుగా శాస్త్రవేత్తగా కొనసాగుతున్నారు.

వల్లూరి ఉమామహేశ్వరరావు
ఖమ్మంకు చెందిన యువశాస్త్రవేత్త ఈ జర్నీలో ఆపరేషన్‌ మేనేజర్‌గా వ్యవహ రించారు. ఖమ్మం శ్రీనగర్‌ కాలనీకి చెందిన రిటైర్డ్‌ పీఆర్‌ డీఈ వల్లూరు కోటేశ్వరరావు, పద్మావత తనయుడు వల్లూరి ఉమామహేశ్వరరావు 2013 ఇస్రో శాస్త్రవేత్తగా చేరారు. పదేండ్లగా వివిధ ప్రయో గాల్లో పాలుపంచుకున్నారు. డిజైనింగ్‌ విభాగాల్లో 1500 మంది పైగా పనిచేస్తున్నారు. ఆపరే షన్‌ మేనేజర్లుగా 30 మందిని సెలెక్ట్‌ చేసుకున్నారు.. ఆ ముఫ్పై మందిలో ఉమామహేశ్వరరావు కూడా ఒకరు. చంద్రయాన్‌-3 మిషన్‌