యువకులు యువకులు యువకులు

యువకులు యువకులు యువకులు
నవమానవ జీవన తళుకులు
పసితనానికి ముసలితనానికి
మధ్యన మెరిసే దివ్యశక్తులు

చిగురులు ముదిరితే ఆకులు
శిశువులు పెరిగితే యువకులు
దేశ ప్రగతి సుగతికి యువరక్తం
సదా సర్వదా బహు ఉపయుక్తం

యువకులే..మన సంఘసేవకులు
సమాజ రక్షణలో వీరసైనికులు
యువకులే..మన దేశపాలకులు
సమాజనౌకకు సదా నావికులు

సాహసమే తమ శ్వాసగా…..
ఆదర్శాలే తమ ధ్వాసగా…..
జీవించే ఘనులు యువకులు
పురోగమనానికి వారే ప్రతీకలు

యువకులే నిత్య యుద్ధయోధులు
ప్రగతిరథాన్ని నడిపించే సారథులు
మూఢవిశ్వాసాలకు విరోధులు
నవసమాజ భవనపు పునాదులు

కులగజ్జి సోకితే సంఘనాశకులు
మతపిచ్చి పట్టితే మతోన్మాదులు
ధర్మవర్తనులు ధర్మరక్షణ దీక్షితులు
ఈ ధరణీతలమున ధన్యజీవులు

ఈ సమాజ జీవన గాయకులు
మన సంస్కతి రక్షణ నాయకులు
త్యాగానికి వారివే ముందువరుసలు
నాటి వీరశివాజీకి నిజవారసులు

ధైర్య స్థైర్యమున నేతాజీలు
శాంతి అహింసల బాపూజీలు
”ఆజాద్‌” ”అల్లూరి”కి సోదరులు
సమసమాజానికి రహదారులు

యువకులు జనకుల కానుకలు
పాలన జీవన హదయప్రేమికులు
నవ్యసమాజానికి చేసే మార్పులు
నేర్పు కూర్పుల యువతీయువకులు

(అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా)
– ”జనశ్రీ” జనార్ధన్‌ కుడికాల
9703275050