
జన్నారం మండలంలోని రోటి గూడ గ్రామంలో ఉన్న యువకులకు ఆదివారం గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పు శ్రీనివాస్ వాలీబాల్ కిట్లను అందజేశారు. యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు కావద్దని సూచించారు. చదువు, క్రీడలపై ఆసక్తి చూపించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. గ్రామ యువకులు పాల్గొన్నారు.