యువ కవి ధారా శ్రీకాంత్ కు హైదరాబాదులో ఘనంగా సన్మానం

నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన యువ కవి ధారా శ్రీకాంత్ కు హైదరాబాదులో ప్రముఖ జాతీయ సోషల్ మీడియా గ్రూప్ కవి సాయంత్రం ఐదవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో హైదరాబాద్ నాచారంలో ప్రముఖ కవి జయరాజ్, మౌనశ్రీ, మాలిక్ గ్రూప్ అడ్మిన్ ముక్కెర సంపత్ గారి ఆధ్వర్యంలో జ్ఞాపిక అందించి, శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి జయరాజ్ మాట్లాడుతూ ఏజెన్సీలో మట్టిలో మాణిక్యం ధారా శ్రీకాంత్ అని ప్రశంసల వర్షం కురిపించారు. ఏజెన్సీలో ఎన్నో కవితలు రాసారని, సమాచాన్ని జాగృతి పరిచే విధంగా కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సినీగే రచయిత మౌనశ్రీ, మాలిక్ గ్రూప్ అడ్మిన్ ముఖ్యర సంపత్ కుమార్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.