నవతెలంగాణ-గరిడేపల్లి
డెంగ్యూ జ్వరంతో యువతి ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో శనివారం జరిగింది. కీతవారిగూడెం గ్రామానికి చెందిన కడప వినీత(29) ప్రయివేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేది. కొద్దినెలల కింద తల్లీతండ్రి చనిపోవడంతో సోదరుల ఇంటి దగ్గరే ఉంటోంది. ఆమెకు డెంగ్యూ జ్వరం వచ్చి సరైన చికిత్స అందక పరిస్థితి విషమించి శనివారం మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు.