
జయశంకర్ భూ పాలపల్లి జిల్లా మహముత్తారం మండలం బోర్లగూడెం లో గండ్ర కిషన్ రావు అనె యువరైతు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. గ్రామస్థుల కథనం ప్రకారం మృతుడు తన వరిపొలానికి నీరు పెట్టుటకు వారి వ్యవసాయ బావిలోని మోటారు కు విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు వైరు తగిలి షాక్ కు గురై పొలంలోనే మృతోచెందినట్లు తెలిపారు. కళ్ళ ముందు తిరిగిన యువకుడు అకస్మాత్తుగా షాక్ కు గురై మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న మహముత్తారం పోలీసులు కేసునమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.