
రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన శిరీష (25) విష జ్వరంతో మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గత వారం రోజులుగా జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లిన తగ్గకపోవడంతో గురువారం రాత్రి 9 గంటలకు కావేరి ఆసుపత్రిలో మృతి చెందిందని గ్రామస్తులు పేర్కొన్నారు. వైరల్ ఫీవర్ తగ్గకపోవడంతో ప్లేట్ సెట్స్ పూర్తిగా పడిపోవడం వల్లనే ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలుస్తోంది. జ్వరంలో ఫిట్స్ కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలలో పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వల్లనే ఆమెకు వైరల్ ఫీవర్ వచ్చి ఉంటుందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. శుక్రవారం గ్రామంలో వినాయక నిమజ్జనం ఉండటం వల్ల త్వరగా ఆమెకు అంత్యక్రియలను జరిపించారు.