యువ మహిళా నాయకులు

young woman The leadersనేటితరం అమ్మాయిలు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోరుకుంటున్నారు. దాని కోసం ఎంతో శ్రమిస్తున్నారు. అచంచలమైన ఆత్మ విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. తమ భవిష్యత్తును రూపొందించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి నలుగురు స్ఫూర్తిదాయక యువ మహిళా నాయకుల గురించి ఈ రోజు మనం తెలుసు కుందాం…
బోటిక్‌ నిర్వాకురాలిగా…
బర్వానీలోని బిజాసన్‌ గ్రామానికి చెందిన కౌశల్య దావర్‌ 26 ఏండ్ల వ్యవస్థాపక శక్తి. ఆమె తన సంఘంలో ఓ స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచింది. తన పరిమిత విద్యావకాశాలను ఉపయోగిం చుకొని బోటిక్‌ షాప్‌ నడుపుతోంది. ట్రాన్స్‌ఫార్మ్‌ రూరల్‌ ఇండియా  వారి మద్దతు కూడా పొందింది.కి చెందిన యూత్‌ ఫెలో రీనాతో కలిసి పని చేసి తన సామర్థ్యాన్ని దేశం గుర్తించేలా చేయగలిగింది. ఫలితంగా యాక్సిలరేటెడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ లో తన పేరు నమోదు చేసుకోగలిగింది. ు=× మార్గదర్శకత్వంతో కౌశల్య తన వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతోంది. సాంకేతికతను ఉపయోగించుకుని డిజిటల్‌ చెల్లింపు పద్ధతులను ప్రారంభించింది. కెనరా బ్యాంక్‌ నుండి ముద్రా స్కీమ్‌ రుణం తీసుకుని తన వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంది. ఇప్పుడు తన లాంటి అమ్మాయిలకు ఉపాధి కల్పిస్తుంది. తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసి మరికొంత మంది అమ్మాయిలకు ఉద్యోగాలు అందిస్తూ తన పిల్లలకు మంచి విద్యను అందించాలని ఆమె భావిస్తుంది.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా
బిహార్‌లోని నవాడా జిల్లాలోని రాజౌలీ సబ్‌డివిజన్‌లోని అమవాన్‌లో జన్మించిన అన్ను కుమారి తన 20 ఏండ్ల వయసులో పెండ్లిని ధిక్కరించింది. తర్వాత తన నివాసానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ అకాడమీలో చేరి తన జీవితానికి ఓ మంచి మార్గాన్ని ఏర్పరచుకుంది. పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం శ్రమించింది. జాతీయ స్థాయిలో పని చేసే ఎన్‌జీఓ అయిన పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన కిషోరి సమూ కార్యక్రమంలో ఆమె చురుగ్గా పాల్గొనడంతో అన్నూ ప్రయాణం ప్రారంభమైంది. ఈ సంస్థ బాలికలకు రుతుక్రమ పరిశుభ్రత నిర్వహణ, పోషకాహారం, ఆరోగ్యంపై శిక్షణ ఇవ్వడంలో కీలకంగా పని చేస్తోంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గట్టిగా పని చేస్తున్న అన్నూ, స్థానిక అధికారులకు తక్షణమే సమాచారం అందిస్తూ తన గ్రామంలో అలాంటివి జరగకుండా పూర్తిగా నివారించగలిగింది. పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియాలో బ్లాక్‌ కోఆర్డినేటర్‌ అయిన షీలా దేవి మార్గదర్శకత్వంలో అన్నూ తన వివాహం కంటే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయం ఆమెను పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కెరీర్‌ ప్రారంభించేలా చేసింది. అంతేకాదు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనే యువతులకు అండగా నిలబడుతోంది. యువ వేదిక అయిన కిషోరి సమూలో ముఖ్యమైన సభ్యురాలిగా కూడా నిలిచింది.
మహిళల ఉచిత ప్రయాణం కోసం…
ఒడిశాకు చెందిన 22 ఏండ్ల ప్రాచీ మిశ్రా.. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు సాధికారత కల్పించేందుకు విశేష కృషి చేస్తున్న FreeBusForWomen ఆన్‌లైన్‌ ప్రచారంలో ముందంజలో ఉంది. అచంచలమైన దృఢ సంకల్పంతో మహిళలకు అవసరమైన చైతన్యం, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి అవకాశాలకు అందించడంలో ఆమె చురుగ్గా పని చేస్తుంది. విద్య, ఆరోగ్య సంరక్షణను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా ఆర్థిక పరిమితులు, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది బాలికలు, మహిళలు ఇప్పటికీ అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉన్నారని ఆమె అంటుంది. ఆ అడ్డంకుల ఫలితంగా వారి జీవితాల్లో ఎలాంటి మార్పూ లేక పేదరికంలోనే మగ్గిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు కాంప్లిమెంటరీ పాస్‌లు అందించాలని, అదనపు జిల్లాలకు ఈ సేవలను విస్తరించాలని ప్రాచీ తన ఆన్‌లైన్‌ పిటిషన్‌ ద్వారా ఒడిశా ముఖ్యమంత్రికి, వాణిజ్య, రవాణా శాఖ మంత్రిని కోరింది. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం నాలుగు నగరాలకే పరిమితమైంది. ఫ్రీ బస్‌ అనేది అందరికీ అందుబాటులో ఉంటే మహిళల అభివృద్ధికి ఉపయోగంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
పర్యావరణ పరిరక్షణ కోసం…
దుబారులో జరిగిన 28వ ఐక్యరాజ్యసమితి వాతా వరణ మార్పు సదస్సు లో ప్రసంగించడానికి గూగుల్‌చే ఆహ్వానించబడిన ఏకైక భారతీయురాలు ఆమె. మహారాష్ట్రలోని థానేకి చెందిన నటి, యూట్యూబర్‌. అలాగే సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటూ ఎన్నో సమాజిక కార్యక్రమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రజక్తా కోలీ. ఖచీణూ ఇండియా యూత్‌ క్లైమేట్‌ ఛాంపి యన్‌ హోదాలో సేవలందిస్తూ, ప్యానల్‌ డిస్కషన్‌లలో చురు గ్గా పాల్గొంటుంది. వాతావరణ మార్పు, గ్లోబల్‌ వార్మింగ్‌, జీవవైవిధ్య నష్టం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించడం తన లక్ష్యంగా పెట్టుకుంది. పేద, అట్టడుగు వర్గాలపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో నిత్యం అవగాహన కల్పిస్తుంది. ఈ పర్యావరణ సవాళ్లను పరిష్కరించడంలో ప్రభుత్వాలు, సంఘాలు, వ్యక్తులు తీసుకోవల్సిన బాధ్యతను వారికి అర్థమయ్యేలా వివరిం చడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీని కోసం ఐక్యంగా కలిసి పని చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.