నీ ప్రయాణం…

Your journey...– ధాత్రి
సాధించేవాడికి కష్టాలెక్కువ…
ముందుకెళ్ళేవాడికి అడ్డంకులెక్కువ…
ఎదిగేవాడికి ఏడుపులెక్కువ…
కానీ… ఎదురేగి ఎదురించేవాడే
పైవారందరినీ తన కాళ్లకిందకి
నెట్టగల సామర్ధ్యం కలిగి ఉంటాడు…
గెలుపు ఎవడికీ దూరం కాదు…
అలాగనీ దగ్గరా కాదు…
దానిని పొందాలన్న ఆకాంక్ష ఉంటే
దానం చేయాల్సింది ధనం కాదు శ్రమను…
గెలిచే ప్రతోడూ
మన మధ్యోడే, ఓడేవాడూ వాడే…
రేపటిని పొందాలంటే నేటిని,
విజయాన్ని పొందాలంటే నిన్ను
నువ్వు అర్పించాల్సిందే కాలానికి…
నీబోటోడితో నీకేంటి పోలిక
నువ్వంటే వేరే కదా!
అనుమతవసరమా పోరాడ్డానికి?
వేచిచూడాలా సందర్భానికి?
అడుగేస్తే కదా కలిసేది పయనం నీతో…
అడిగేస్తే కదా తెలిసేది తెలీంది ఎంతో…
పొరపాటున రాదు అవకాశం, పోరాడితే వస్తది…
తెరచాటున లేదు కదా గెలుపు ఎత్తి చూడ్డానికి…
వాడిలా ఉండటానికి నువ్వు ఖర్చు పెట్టే క్షణం నీదే కదా!
నీకోసం ఇచ్చే వాటిలో వాడిదుందా ఇసుమంతైనా ?
గాల్లో కట్టే మేడ ఎలా కనిపించదో,
నువ్వు లేని జాడ కూడా అంతే, నీకంటూ గుర్తింపు లేకుంటే!