– ఆల్ట్రావయోలెట్ కొత్త ఈవీ బైక్ ఆవిష్కరణ
బెంగళూరు: ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) స్టార్టప్ ఆల్ట్రావయోలెట్ తాజాగా భారత్ మార్కెట్లోకి తన ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్2 మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. సింగిల్ చార్జింగ్‌తో 323 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చని ఆ కంపెనీ తెలిపింది. ఇది ఇంతకుముందు 2022 చివర్లో ఆవిష్కరించిన ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మోటారు సైకిల్ అప్ డేటెడ్ వర్షన్ బైక్ అని పేర్కొంది. స్టాండర్డ్, రెకాన్ వేరియంట్లలో లభించే ఈ బైకు తొమ్మిది రంగుల్లో లభ్యమవుతుందని తెలిపింది. ఎక్స్‌షోరూం వద్ద స్టాండర్డ్ వేరియంట్ బైక్ రూ.2.99 లక్షలు, రెకాన్ వేరియంట్ రూ.3.99 లక్షలుగా నిర్ణయించింది.