– జిల్లా ఎమ్మెల్యేను ఉద్దేశించి.. కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు కొల్కూరి నర్సింహరెడ్డి వ్యాఖ్య
నవతెలంగాణ-పటాన్‌చెరు
‘మీ కద్దరు బట్టలు పదవులు కాంగ్రెస్ పుణ్యమే’ అని మర్చిపోవద్దని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ధ్వజమెత్తారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు ‘దయ్యాలు వేదాలు వల్లించి నట్టే ఉన్నది’ అంటూ తీవ్రంగా ఖండించారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సోమవారం ఆయన విలే కరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సమైక్య పార్టీలకు ఊడిగం చేసిన వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంపీపీ, ఎంఎల్‌సి, జెడ్పీటీసీ పదవులు పొంది.. ఆస్తులు, అంతస్తులు సంపాదించి కాంగ్రెస్‌ని తిట్టడం సిగ్గు చేటన్నారు. ఈ జిల్లా నుంచి పరిశ్రమల సీఎస్సార్ నిధులు కోట్ల రూపాయలను సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు తరలించి నప్పుడు, గతంలో మంజీర నీటీని ఇతర జిల్లాలకు తరలిం చినప్పుడు, అలాగే బడ్జెట్ నిధులు ఈ జిల్లాకు ఇవ్వకుండా ఇతర నియోజకవర్గాలకు తరలించినప్పుడు మంత్రి హరీశ్‌రా వుపై నోరు మెదపని బీఆర్‌ఎస్ జిల్లా ప్రజా ప్రతినిధులు.. కాంగ్రెస్‌పై, రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన ా్నరు. సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజక వర్గాల్లో మొదటి నుంచి బీఆర్‌ఎస్ జెండా మోసిన ఉద్యమకారులను బొంద పట్టిన ఘనత హరీశ్‌రావుదని ఆరోపించారు. 24 గంటల ఉచిత కరెంటు విషయంలో పటాన్‌చెరు సబ్ స్టేషన్ వద్ద చర్చకు రండి అని ఎమ్మెల్యేలు చేసిన సవాల్‌కు తాము సిద్ధం గా ఉన్నామన్నారు. నేడు(మంగళవారం) ఉదయం 11 గంటలకు పటాన్‌చెరు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద అధికా రుల ను కలుస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 5 నియో జకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఓటమి తప్పదన్నారు. ఈ కార్యక్ర మం లో జిల్లా మైనార్టీ కాంగ్రెస్ సెల్ అధ్యక్షులు హనిబ్, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, నాయకులు కుంచాల కిషన్, హమిత్ పాష, ఉమ్మర్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.