బుల్లెట్ పై మీ ఇంటికి.. మీ ఎమ్మెల్యే..

– మండలంలో పూర్తి అయిన చెక్కుల పంపిణీ..

నవతెలంగాణ – అశ్వారావుపేట
మీ ఇంటికి మీ ఎమ్మెల్యే పేరుతో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రూపొందించుకున్న కార్యక్రమంలో అశ్వారావుపేట లో రెండు రోజులు పాటు నిర్వహించారు.ఈ పర్యటనలో ఆయన 2023 – 2024 ఆర్ధిక సంవత్సరంలో మార్చి 7 వరకు మంజూరు అయిన 37 మంది కళ్యాణ లక్ష్మి,షాదీముబారక్ లబ్ధిదారులకు తానే నేరుగా వారి ఇంటి వద్దనే పంపిణీ చేసారు.గురువారం తన వాహనంలో మండల వ్యాప్తంగా తిరిగి పంపిణీ చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో తన ప్రధాన అనుచరుడు అయిన జూపల్లి రమేష్ బుల్లెట్ నడుపుతూ ఉంటే ఎమ్మెల్యే ఆయన వెనకాల కూర్చుని తిరుగుతూ చెక్కులు పంపిణీ చేసారు. మండల వ్యాప్తంగా 16 పంచాయితీల లోని 35 మంది కి కళ్యాణ్ లక్ష్మి,ఇద్దరికి షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసారు.వీరిలో ఎస్సీ 5,ఎస్టీ 7,బీసీ 14,ఈబీసీ 9,ఎస్ఎం 2 లబ్ధిదారులు ఉన్నారు. పంచాయితీలు వారీగా అశ్వారావుపేట 12,గుర్రాల చెరువు,ఊట్లపల్లి (4 )నాలుగేసి,పేరొందాయి గూడెం,కొత్త మామిళ్ళ వారి గూడెం,మద్ది కొండ,నారంవారిగూడెం (2) రెండేసి,ఆసుపాక,దిబ్బ గూడెం,కేసప్పగూడెం,కోయ రంగాపురం,మల్లాయిగూడెం,నందిపాడు,నారాయణపురం,తిరుమలకుంట,వినాయకపురం( 1) ఒక్కటి చొప్పున పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,ఆర్.ఐ లు పద్మావతి,క్రిష్ణ,మండల పరిషత్ కో – ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా,ఎం.పి.టి.సీ లు వేముల భారతి ప్రతాప్,సత్యవరుపు తిరుమల బాలగంగాధర్,మిండ హరిక్రిష్ణ,పి.ఏ.సి.ఎస్ అశ్వారావుపేట అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ,కాంగ్రెస్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు,జూపల్లి ప్రమోద్,తుమ్మ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.