
మీ ఇంటికే మీ ఎమ్మెల్యే పేరుతో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంగళవారం విస్తృత పర్యటన చేసారు. మండలంలోని రెడ్డిగూడెం,తిరుమల కుంట,మామిళ్ళవారిగూడెం,సున్నంబట్టి,పొందినాడు పంచాయితీల్లో 48 మందికి రూ.45 లక్షల 5 వేల 220 లు విలువ గల కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను,10 మందికి రూ.2 లక్షల 95 వేల విలువ గల సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసారు. అనంతరం పెద్దవాగు ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులను పరిశీలించారు.త్వరితగతిన పూర్తి చేయాలని డీఈ మోతీలాల్,ఏఈ నవీన్ లు కు ఆదేశించారు. అక్కడ నుండి గుమ్మడి వల్లి ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసారు.జ్వరాలు అధికంగా ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మెడికల్ ఆఫీసర్ మధుళిక కూ సూచించారు. ఆయన వెంట అశ్వారావుపేట పీఏసీఎస్ తాజా మాజీ అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, మొగళ్ళపు చెన్నకేశవ రావు,తుమ్మ రాంబాబు నాయకులు జ్యేష్ట సత్యనారాయణ చౌదరి,జూపల్లి ప్రమోద్,బండి చెన్నారెడ్డి లు పాల్గొన్నారు.