ఫిబ్రవరి 16న సమ్మెలోకి మీ సేవా ఉద్యోగులు

– ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌కు సమ్మె నోటీసు అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న జరుగనున్న గ్రామీణ భారత్‌ బంద్‌, సమ్మెలో తాము పాల్గొంటున్నామని తెలంగాణ మీ సేవా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రకటించింది. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌కు ఆ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె.వెకంటేశ్‌ నేతృత్వంలో బృందం సమ్మె నోటీసును అందజేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపింది. ఫిబ్రవరి 16న జరిగే సమ్మెలో మీసేవా ఉద్యోగులందరూ పాల్గొంటారని జయేశ్‌ రంజన్‌ దృష్టికి తీసుకెళ్లారు.