మీ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే

Your services are appreciated: MLA– స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలను విజయవంతం చేయండి

– మీ సేవలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తిస్తుంది
– సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే  తోటా లక్ష్మి కాంతారావు
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాలు చేపట్టే మీ సేవలు అభినందనీయమని ఈ కార్యక్రమాలను ప్రతి గ్రామంలో విజయవంతం కావడానికి ప్రత్యేక కృషి చేయాలని మీ సేవలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తిస్తుందని ప్రత్యేక సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. మద్నూర్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలపై అధికారికంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల గురించి మాట్లాడారు. గ్రామాల శుభ్రత కాలుష్య నివారణ కోసం మీరు చేసే సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. మీ సేవలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండలం ప్రత్యేక అధికారి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ మద్నూర్ ఎంపీడీవో రాణి మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య మండల విద్యాశాఖ అధికారి రాములు నాయక్ ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి పద్మ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.