కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీ సేవలు అమూల్యం..

Your services are invaluable for the strengthening of Congress party..నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మండల పార్టీ అధ్యక్షునిగా రాజు పటేల్ సేవలు అమూల్యమైనవని ఉమ్మడి మద్నూర్ మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన రాజు పటేల్ జన్మదిన వేడుకలు డోంగ్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. శాలువా గజమాలతో సన్మానిస్తూ కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున టపాకాయలు కాలుస్తూ జన్మదిన వేడుకలు భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నాగేష్ పటేల్ హనుమాన్లు స్వామి, రామ్ పటేల్, పరమేష్ పటేల్, వట్నాల రమేష్, అమూల్, శివాజీ పటేల్, శశాంక్ పటేల్, దీన్ దయాల్, యూనుస్ పటేల్, శివరాజ్ పటేల్, ఇరు మండలాల్లోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్క నాయకునికి రాజు పటేల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.