నీ సేవలు తెలంగాణ రాష్ట్రంప్రజలు మరువలేనివి

– ఎంపీపీ ప్రతాప్ రెడ్డి
నవతెలంగాణ- పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి  తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జ‌య‌శంక‌ర్ సార్ త‌న జీవితాంతం క‌ష్ట‌పడ్డార‌ని.తెలంగాణ భావ‌జాల వ్యాప్తికి నిరంత‌రం కృషి చేశార‌ని తెలిపారు. జ‌య‌శంక‌ర్ ఆశ‌యాల సాధాన‌కు చిత్త‌శుద్ధితో తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంద‌న్నారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో ఆయ‌న చేసిన సూచ‌న‌లు, స‌ల‌హాలు భ‌విష్య‌త్ త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలుగా నిలుస్తాయ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ తిరుమలరెడ్డి,బిఆర్ఎస్ యూత్ మండల ప్రెసిడెంట్ చిప్ప రమేష్,హనుమంత్ రెడ్డి,ప్రేమ్ సింగ్, పంచాయతీ సెక్రటరీలుశివాజీ,సుజాతపాల్గొన్నారు