శ్రమజీవుల నీ దారి
సీతారాం ఏచూరి
మరువలేము నీ దారి
ఎర్ర జెండా కాపరి
ప్రజాస్వామ్య నీ దారి
సీతారాం ఏచూరి
మరువలేదు నీ దారి
రాజ్యాంగపు కాపరి
సోషలిజం నీ దారి
సీతారాం ఏచూరి
కష్టమైనా నీ దారి
కామ్రేడ్లకు కాపరి
కమ్యూనిజం నీ దారి
సీతారాం ఏచూరి
ఎంతైనా నీ దారి
ఇంతేనని చెప్పను మరి
జోహారులు ఏచూరి
సీతారాం ఏచూరి
ఎరుపెక్కని నీ దారి
వేగుచుక్క నీ దారి
ప్రజాహితుడ ఏచూరి
సీతారాం ఏచూరి
పిడికిలెత్తి నీ దారి
ప్రజా పోరు సాగు మరి..
– గంధం శ్రీ, 8096382561