మత్తు పదార్థాలకు బానిసలవుతున్న యువత

– ఇష్టారాజ్యంగా గుట్కా విక్రయాలు చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రం తో పాటు పరిసర గ్రామ ప్రాంతాలలో నిషేధిత గుట్కా లు విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ అమ్ముతుండడంతో యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని ప్రజలు ఇందుకు సంబంధించిన అధికారులుప్రత్యేక శ్రద్ధ చూపకపోతే పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం నిషేధించిన గుట్కాను ఏదో సాకు చూపి విచ్చలవిడిగా పట్టణంలో క్రమవిక్రయాలు జరుపుతున్నారు.ఈ నేపథ్యంలో చదువుకునే విద్యా ర్థులు వాటిపై మక్కువ చూపుతున్నట్లు సమాచారం ఇదే పూర్తిస్థాయిలో జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్ర భావం చూపుతుందని చదువుపై శ్రద్ధ అటు ఉంచితే ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వారంటున్నారు.యదేన్న ఎవరు పట్టించుకోలేదని ప్రజలు అంటున్నారు.ప్రభుత్వము జీవో విడుదల చేయకుండా జీవో విడుదల చేశారంటూ దుకాణాలలో ఎక్కడపడితే అక్కడ గుట్కాలు దర్శనమిస్తున్నాయి. ఎవరైనా ఏమి అని అడిగితే ప్రభుత్వము అమ్ముకునేందుకు జీవోవచ్చిందని వారంటున్నారని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వము నిషేధిత గుట్కాలు, అక్రమ ఇసుక రవాణా, జూదము, తదితర వాటిపై ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు నియమిస్తే వారు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదేమోఅందుకే సోద్యం చూస్తు న్నారు అని అర్థం అవుతున్నట్లు వారంటున్నారు. ప్ర భుత్వం నిషేధించిన ఇలాంటి వాటిపై సంబంధిత అధికారులకు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని వారు చర్చించుకుంటున్నారు.ప్రభుత్వం ప్రత్యేక పోలీసులు నియమించిన ఫలితం కనిపించలేదని వారు అంటున్నారు.నిషేధిత గుట్కాలపై పిల్లలు మక్కువ చూపుతున్నడంతో పెద్దలలో భయాందో ళనలకు చెందుతున్నారు.ఒక్కసారి విక్రయాలు జరిపే వారిని అధికారులు పిలిపించి వారికి ఇచ్చిన ప్రత్యేక జీవో ఏమిటో చూస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.మత్తు పదార్థాలను నిషేధించి నప్పుడు తల్లిదండ్రుల ముఖంలో ఆనందం ఉండేదని ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ నిషేధి త గుట్కాలు కనిపించుతున్నడంతో పిల్లలు చెడు దావపడతారేమో అని తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. మండలం మరియు పరిసర ప్రాంతాల్లో ఒక దుకాణం వ్యక్తి దగ్గరికి వెళ్లి నిషేధిత గుట్కాలు ఏ విధంగా అమ్ముతున్నావని అడిగితే మాకు అమ్మే వ్యక్తి మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని పబ్లిక్ గా అమ్ముకోవచ్చని చెప్పారని అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఉన్నతాధికా రులు స్పందించి గుట్కాలపై ఉన్న చిక్కుముడిని విడదీయాలని పుర ప్రజలు కోరుతున్నారు.