స్మార్ట్‌ ఫోన్‌లకు యువత బానిస..!

– రీల్స్‌, షార్ట్స్‌ చూస్తూ సమయం వృథా
– నియంత్రించాల్సింది..తల్లిదండ్రులే.!
నవతెలంగాణ-దోమ
యువత స్మార్ట్‌ ఫోన్‌లకు బానిసలుగా మారిపో తున్నారు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసు కోకుండా అనవసర విషయాలపై ఆసక్తి చూపుతూ విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారు. కొందరూ మంచి వీడియోలు చూస్తూ రోజువారి పనులను సైతం మర్చిపోతున్నారు. మరికొందరు మంది స్వయంగా వీడియోలు తీసుకొని అప్లోడ్‌ చేస్తూ వినో దాన్ని పొందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌ బుక్‌, యూ ట్యూబ్‌, షేర్‌ చాట్ల హవాలో యువత కూరుకుపోయి బంధీ లుగా మారుతున్నారు. రోజుల తరబడి తక్కువ విడివి కలి గిన రీల్స్‌, షార్ట్స్‌ చూస్తూ మానసిక వ్యాధుల బారిన పడు తున్నారు.
‘తక్కువ నిడివి గల వీడియోలపై ఆసక్తి’
తక్కువ సమయంలో అందించే వినోదం పట్ల ఎక్కువ మంది యువత, చిన్నారులు ఆకర్షితులవు తున్నారు. గతం లో సినిమాల పట్ల ఆసక్తి చూపే యువత స్మార్ట్‌ ఫోన్లు వ చ్చాక వినోదాలు, టిక్‌టాక్‌ లాంటిపై ఆసక్తి చూపుతున్నా రు. దేశంలో టిక్‌టాక్‌ను నిషేధించిన తర్వాత ఇన్స్టాగ్రామ్‌ రీల్స్‌, యూట్యూబ్‌లో షార్ట్స్‌ మొగ్గు చూపుతున్నారు. రీల్స్‌, షాట్స్‌ వచ్చాక సాధారణ వీడియోలు చూడటం తగ్గించి తక్కువ నిడివి కలిగిన వీడియోలపై యువత ఆసక్తి చూపు తుందని యూట్యూబ్‌ స్వయంగా వెల్లడించింది. 2 నిమి షాలపైన ఉన్న వీడియోలను సైతం చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆధునిక సాంకేతికత కలిగిన ఫోన్‌ లు అం దుబాటులోకి రావడంతో యువత ఫోన్‌లతో ఎక్కు వ సమ యం గడుపుతోంది. ఆ వీడియోలు మనిషిపై తీవ్ర ప్రభా వం చూపి మానసిక రుగ్మతలకు గురవుతున్నారు.
పెరుగుతున్న ప్రమాదాలు
రీల్స్‌, షార్ట్స్‌ అప్లోడ్‌ చేయా లనే ఉత్సాహంతో యువత బస్టాండ్లు, రోడ్లు, నీటికొలనులు, చెరువుల సమీపంలో వీడియో లు తీస్తూ జరుగుతున్న ప్రమా దాలు నానాటికి పెరుగు తున్నా యి. వాహనాలు నడుపుతూ వీడియోలు తీయడంతో వారితో పాటు ఇతరులకు ప్రమా దాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. యువత స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌ మోసలకు వైపు దృష్టి మళ్లిం చకుండా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుని తల్లి దండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి.
– రవిగౌడ్‌, దోమ ఎస్‌ఐ