యువత విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు

నవతెలంగాణ – పెద్దవూర
నేటి యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు బానిసలై విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని ఎస్ఐ వీరబాబు అన్నారు. బుధవారం డ్రగ్స్, మారక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా కు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్బంగా  మండలం కేంద్రం లో కస్తూరిబా గాంధీ బాలికలు, యూత్ ఆధ్వర్యంలో పెద్దవూర మండల కేంద్రం లో బారీ ర్యాలీ నిర్వహించి మత్తు, మాదక దృవ్యాల నిషేధం పై  అవగాహన కల్పించారు.  చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలు సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన సమస్య గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూన్ 26న జరుపుకుంటామని తెలిపారు. డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం ఇప్పటికీ చేస్తున్న తీవ్ర సాంస్కృతిక మరియు ఆర్థిక హాని గురించి అవగాహన కల్పించామని తెలిపారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్య సాధన వైపు పయనిం చాలని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.