పార్లమెంట్ పై యువతకు అవగాహన కార్యక్రమం

నవతెలంగాణ – భువనగిరి
స్థానిక జాగృతి డిగ్రీ కళాశాలలో నెహ్రు యువ కేంద్రం నల్గొండ  ఆధ్వర్యంలో  పార్లమెంట్ ప్రోగ్రాం లో భాగంగా మోక్ పార్లమెంట్, నారి శక్తి, చిరు ధాన్యాలు, మై భారత్ అనే అంశాలపై యువతకు అవగాహనా సదస్సు కల్పించారు. ఈ  సందర్భంగా కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ మణిపాల్ రెడ్డి, పర్యావరణ వేత్త సురేషగుప్త విశిష్ట అతిధులుగా హాజరై మాట్లాడారు. యువత మోక్ పార్లమెంట్ లాంటి ప్రోగ్రాం లో ఉత్సాహంగా పాల్గొనాలని, ఇలాంటి అవగాహన సదస్సులను ఉపయోగించుకోవాలని ప్రోత్సహించారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కొరకై యువత తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. సురేష్ గుప్త మాట్లాడుతూ చిరు ధాన్యాల వినియోగాము పై అందరు అవగాహనా కలిగి ఉండాలని కోరారు. ప్రకృతికి దగ్గరగా జీవించాలని సూచించారు. యువత తమ తమ గ్రామాల్లో తడి చెత్త పొడి చెత్త వేర్పాటు పై ప్రజలను అవగాహన కల్పించాలని కోరారు. మోక్ పార్లమెంట్ మరియు సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతిభ కనిబరిచిన యువతకు బహుమతులు మరియు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సదస్సులో మహిళా సాధికారత కేంద్ర జిల్లా మిషన్ కోఆర్డినేటర్ శ్రీమతి హర్ష, నెహ్రు యువ కేంద్ర అధికారి ప్రవీణ్ సింగ్,.నవభారత్ యూత్ అధ్యక్షుడు సరగడ కరుణ్,  ఎన్వైకే వాలంటీర్ అంబేద్కర్. , కొండా నాయక్, యువతీ యువకులు పాల్గొన్నారు.