ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ 

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పోగుల రాజశేఖర్ (27) మృతి చెందాడు. రాజశేఖర్ తండ్రి 12 సంవత్సరాల క్రితం మృతి చెందడు.  దీంతో కుటుంబ బాధ్యత రాజశేఖర్ చూసుకున్నాడు కరోనా సమయం నుంచి బంధువుల వద్ద తీసుకువచ్చిన రూ .2 లక్షల రూపాయల అప్పు ఎలా తీర్చాలని మనోవేదన చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున తల్లి బాగ్యవ్వ ఉరి వేసుకుని ఉన్న కొడుకును చూసి పోలీసులకు సమాచారం అందించింది.విషయం తెలుసుకున్న పోలీస్ లు  సంఘటన స్థలానికి చేరుకుని తల్లి పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.