
నవతెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్ ) చైర్మన్ గా నియమితులైన నాగరిగారి ప్రీతం ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన తుంగతుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరు చిరంజీవి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 37 కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించారు.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ వాసి ఎస్సి సామాజిక వర్గానికి చెందిన నాగరిగారి ప్రీతం విద్యార్థి నాయకుని దశ నుండి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.21 సంవత్సరాలకి ఎన్ ఎస్ యు ఐ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు పార్టీ పిలుపు మేరకు ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్న క్రమంలో నేడు ఎస్సీ కార్పొరేషన్ పదవి సాధించారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ రావడానికి సహకరించిన ముఖ్యమంత్రి కి పార్టీ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.