యువజన కాంగ్రెస్ డిండి

– మండల కార్యదర్శిగా సత్యనారాయణ 
నవతెలంగాణ డిండి: ఇటీవల డిండి మండల యువజన కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించారు. యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా డిండి గ్రామ నివాసి గడ్డమీది సాయి, కార్యదర్శిగా మండలంలోని నిజాంనగర్ గ్రామానికి చెందిన వింజమూరి సత్యనారాయణ  ఎన్నికైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవకాశానిచ్చిన  దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మండల అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర రాంసింగ్ నాయక్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, యువజన కాంగ్రెస్ నాయకులకు, పలువురు ముఖ్య నేతలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, గ్రామస్థాయి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానన్నారు.