యూత్ కాంగ్రెస్ బలోపేత కోసం కృషి చేయాలి

Youth Congress should work for strengthening– యూత్ కాంగ్రెస్ ఎన్నికల అధికారి కపిల్ దామోదర్
– సభ్యత్వంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి
– పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
యూత్ కాంగ్రెస్ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని యూత్ కాంగ్రెస్ ఎన్నికల అధికారి కపిల్ దామోదర్ అన్నారు. శుక్రవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  క్యాంపు కార్యాలయంలో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇప్పటివరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేయడం జరిగిందని తెలిపారు.యూత్ కాంగ్రెస్ కమిటీలో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నవారు విత్ ఐవైసీ యాప్ ద్వారా ఎన్నికలలో పోటీ చేయవచ్చని వివరించారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు పోటీ చేయడానికి అర్హులని వెల్లడించారు. ఓపెన్ సిస్టం ద్వారా ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 20 వరకు నామినేషన్, 22 నుంచి 26 వరకు స్కూటీని, 28న అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు.ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు సభ్యత్వ నమోదు, ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాయకునిగా ఎదగడానికి యూత్ కాంగ్రెస్ మొదటి మెట్టని అన్నారు. ఎన్నికలలో పోటీ తత్వం పెరగాలని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదులో నల్లగొండ జిల్లాను మొదటి స్థానంలో నిలపడంతో పాటు పార్టీని బలోపేతం చేయాలని యూత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జి కోర్ర రాంసింగ్, నల్గొండ అసెంబ్లీ అధ్యక్షులు షేక్ జహంగీర్ బాబా, జనరల్ సెక్రటరీలు పుట్ట రాకేష్, మంచికంఠ సిద్ధార్థ, నల్గొండ టౌన్ అధ్యక్షులు గాలి నాగరాజు, ఉపాధ్యక్షులు నందిని,నల్గొండ మండల అధ్యక్షుడు కొప్పు నవీన్ గౌడ్, కనగల్ మండల అధ్యక్షుడు కుసుకుంట్ల రాజి రెడ్డి, మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు అజార్, ప్రవీణ్, మామిడి కార్తీక్, పాదం అనిల్, వంశీ, పవన్ యాదవ్, సల్ల నరేష్ , మేరెడ్డి ప్రవీణ్ రెడ్డి, హరి ప్రసాద్,అజారుద్దీన్ పాల్గొన్నారు.