కాలువలో యువకుల చేపల వేట

Youth fishing in the canalనవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండల మండల కేంద్రం నుండి  ఉప్లూర్ గ్రామానికి వెళ్లే దారిలో వరద కాలువ దిగువన ఉన్న కల్వర్టు మాటు కాలువలో యువకులు ఆదివారం సాయంత్రం చేపలు పడుతూ ఎంజాయ్ చేశారు. పలువురు యువకులు కాలువలో గాలాలను వేసి చేపల వేటను కొనసాగించారు.ఇటీవల కురిసిన వర్షాలకు కాలువలో జోరుగా నీరు ప్రవహిస్తుండడంతో చేపలు కాలువలు కొట్టుకు వస్తాయన్న ఆశతో యువకులు చేపలు వేటను కొనసాగించారు. కల్వర్టు గద్దెపై ఉండి కాలువలోకి తమ గాలాలను విసిరారు. తాము వేసిన గాలాలకు చేపలు చిక్కడంతో పలువురు యువకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్వయంగా చేపలను వేటాడుకుని తేడా తమకెంతో సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా యువకులు పేర్కొన్నారు. కాలువలో యువకులు చేపల వేట కొనసాగిస్తుంటే ఈ దారి గుండా పోయే వాహనదారులు, ప్రయాణికులు కాలువ వద్ద ఆగి మరి ఆసక్తిగా తిలకించారు.