
నిరుపేద కుటుంబాలకు యూత్ ఫర్ యూనిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సభ్యులు తెలిపారు. ఆదివారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో యూత్ ఫర్ యూనిటీ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో మరణించిన గ్రామానికి చెందిన యశ్వంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి గ్రామస్తుల తరపున 31 వేల 200 రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యూనిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.