మండల పరిధిలో మారుమూల గ్రామీణ ప్రాంతమైన పద్మనాభునిపల్లి నుంచి తిమ్మాపూర్ హై స్కూల్ కి ఉన్నత చదువుల కోసం కాలినడక వెళ్ళే విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన తిమ్మాపూర్ ప్రధానోపాధ్యాయులు పెంటయ్య, పద్మనాభునిపల్లి హెచ్ఎం మల్లికార్జున్ లను పద్మనాభునిపల్లి గ్రామ యువత గురువారం అభినందించారు.ఈ సందర్భంగా హెచ్ఎం మల్లికార్జున్ ను గన్నెబోయిన సతీష్ గౌడ్, ముక్కపల్లి శ్రీనివాస్, కండ్లకొయ్య స్వామి చరణ్ లు పాఠశాల ప్రాంగణంలో శాలువాతో సత్కరించారు. అనంతరం విద్యార్థుల పక్షాన ఇరువురు ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం పాఠశాలలో విద్యార్థులకు త్రాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం సీఎన్ఆర్ ఫ్యామిలీ దృష్టికి రావడంతో గ్రామ యూత్ సభ్యులతో గన్నె బోయిన సతీష్ గౌడ్ కలిసి బోరు వేయడానికి అనుకూల ప్రదేశాన్ని గుర్తించారు.కార్యక్రమంలో రాజశేఖర్, కర్నాకర్, ప్రవీణ్, సాయి,నవీన్, శ్రీనివాస్, అరవింద్, భాస్కర్ తదితరులు ఉన్నారు.