తెలంగాణ సాహితి డివైఎఫ్‌ఐతో కలిసి ‘యూత్ లిటరరీ ఫెస్ట్’ను అక్టోబర్ 4,5 తేదీలలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నాం. కథ, కవిత, నవల, విమర్శ, పాట అంశాలపై చర్చ, స్వీయ విశ్లేషణ వుంటుంది. 40 ఏండ్లలోపు రచయితలు పాల్గొంటారు. వర్తమాన కవిత్వం – తీరుతెన్నులపై యువ కవులతో చర్చ, పాటల రచయితలతో సంభాషణ… కవి సమ్మేళనం, 4వ తేదీ సాయంత్రం సాంస్కతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి డా|| మామిడి హరికృష్ణ, డా||ఏనుగు నరసింహారెడ్డి, డా|| ఎస్.రఘు తదితరులు హాజరవుతారు. పాల్గొనువారు తమ పేర్లను నమోదు చేసుకోగలరు.
– కె.ఆనందాచారి, 8897765417
తెలంగాణ రచయిత సంఘం వార్షిక సాహిత్య సభలు
తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వార్షిక సభలు అక్టోబర్ 6వ తేదీ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.30 వరకు రవీంధ్రభారతి సమావేశ మందిరంలో జరుగుతాయి. ఇందులో ఘనపరం దేవేందర్, డా||నాళేశ్వరం శంకరం, డా||పరాంకుశం వేణష్ట్రగోపాలస్వామి, డా||నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఆచార్య సూర్యాధనుంజరు, కందుకూరిశ్రీరాములు, డా||వి.శంకర్, కొత్త అనిల్‌కుమార్ తదితరులు పాల్గొంటారు. ఇదే సభలో కవిసమ్మేళనం కూడా వుంటుంది.
– నాళేశ్వరం శంకర్