యువత సృజనాత్మతకు అవకాశం ఇచ్చేందుకే యూత్‌ లిటరరీ

– తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఆనందాచారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
యువతలో ఉన్న సృజనాత్మకశక్తిని వెలికి తీయటం, వారిలో ఉన్న వినూత్న భావాలను వారే స్వేచ్ఛగా ప్రకటించుకునే అవకాశాన్ని కల్పించటమే యూత్‌ లిటరరీ ఫెస్ట్‌ ప్రధాన లక్ష్యమని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఆనందాచారి, డీవైైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేష్‌ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యూత్‌ లిటరరీ ఫెస్ట్‌ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. బుధ, గురువారాల్లో యూత్‌ లిటరరీ ఫెస్ట్‌ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనిలో యువత(40ఏండ్ల లోపు వారే)కు అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. స్వీయ నవలా విశ్లేషణ, స్వీయ కథా విశ్లేషణ, విమర్శ, కవిత్వం, పాటపై చర్చిస్తారని పేర్కొన్నారు.. బుధవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. యువ కవులు, రచయితలు ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌˜్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంతోజు మోహన్‌ కృష్ణ , డీివైఎఫ్‌ఐ హైదరాబాద్‌ నగర అధ్యక్ష,కార్యదర్శులు హస్మీబాబు, జావేద్‌, గోపి తదితరులు పాల్గొన్నారు.