యువత ఫిజికల్ డైరెక్టర్ రాజామల్లయ్య ఆదర్శం

– మున్సిపల్ ఛైర్మన్  ఆకుల రజిత వెంకన్న
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
53 ఏళ్ల వయసులో కూడా హాఫ్ మారతాన్  పూర్తిచేసిన ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజామల్లయ్య నేటి యువత ఆదర్శంగా తీసుకొని తమ ఫిట్ నెస్ ను పెంపొందించేందుకు ప్రతిరోజు పరుగెత్తాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత పిలుపునిచ్చారు. గురువారం హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఫిజికల్ డైరెక్టర్ జన్మదిన సందర్భంగా 21 కిలోమీటర్ల దూరం (హాఫ్ మారథాన్) పరుగెత్తడం అభినందనీయమని అన్నారు. విందులు, కేక్ కటింగ్ లకు ప్రాధాన్యత ఇవ్వకుండా పుట్టిన రోజున అందరూ ఎంతో కొంత దూరాన్ని పరిగెత్తి తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు . రాజామల్లయ్య ను అభినందిస్తూ సన్మానం చేశారు . ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య ,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనితారెడ్డి, హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కేడం లింగమూర్తి, హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల వెంకన్న, స్ఫూర్తి సంస్థ అధ్యక్షులు పందిల్ల శంకర్, మిత్రమండలి -87 ప్రధాన కార్యదర్శి దొడ్డి శ్రీనివాస్, ఏజిపి న్యాయవాది కన్నోజు రామకృష్ణ పాల్గొన్నారు.