నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గ్రామ గ్రామాలలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఎంతో ఉత్సాహంగా పని చేయాలి. ప్రాణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో యూత్ కాంగ్రెస్ నాయకులు తమ సత్తా చాటాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి ధనసరి సూర్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోయూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రీ వర్యులు సీతక్క తనయుడు యూత్ కాంగ్రెస్ కార్యదర్శి దనసరి సూర్య హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యూత్ కాంగ్రెస్ నాయకులు ఎంతో కృషి చేశారని, అలాగే రాబోయే స్థానిక ఎన్నికలలో యూత్ కాంగ్రెస్ నాయకులు సత్త చూపాలని,
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన సంక్షేమ పథకాలు అందిస్తుంది వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి,మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు,రైతులకు 500 రూపాయల బోనస్,ఉచిత గ్యాస్, ఉచిత విద్యుత్,నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు,నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ,ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది,రాబోయే స్థానిక ఎన్నికలలో యూత్ కాంగ్రెస్ నాయకులు ముందుండి ఉత్సాహంగా పనిచేయాలని కోరారు,అలాగే మన అభిమాన నాయకురాలు మంత్రి వర్యులు సీతక్క మన యూత్ కాంగ్రెస్ నాయకులకు అండగా ఉంటానని చాలా సార్లు ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది, యూత్ కాంగ్రెస్ అంటే ప్రభుత్వానికి సీతక్క కి గట్టి నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈస్సార్ ఖాన్ , నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సుమన్ రెడ్డి , జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు పెండెం శ్రీకాంత్, గొంది కిరణ్, చాపల కిషన్ రెడ్డి,మండల యూత్ ఉపాధ్యక్షులు కోరం రామ్మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కు రణదీప్ గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు గుండె శరత్,మణి చంద్, జక్కి వికాస్, గుండె రమేష్ మరియు తదితర జిల్లా,మండల,గ్రామ స్థాయి యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.