– సర్పంచ్ కోళ్ల సురేశ్, ఎంపీటీసీ రాములు
– బొంపల్లిలో వార్డు సభ్యుడు బోయిని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభం
– గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేత
నవతెలంగాణ-దోమ
గ్రామీణ ప్రాంత యువత క్రీడారంగం వైపు మొగ్గుచూపి, తమ ప్రతిభను ప్రదర్శించాలని సర్పంచ్ కోళ్ల సురేశ్, ఎంపీటీసీ రాములు అన్నారు. ఆదివారం దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో వార్డు సభ్యుడు బోయిని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక రోజు ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలు వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు విజయం సాధించటానికి ప్రయత్నించాలని సూచించారు. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దేహదారుఢ్యం కలుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల వైపు దష్టి సారించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ.5 వేలు, రెండవ బహుమతి రూ.3 వేలను అందించి మోమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అంతిరెడ్డి,నర్సింహారెడ్డి,వెంకట్ రెడ్డి, సంగయ్య,గ్రామస్తులు షఫీ, రమేశ్, గుడిసె రాములు, రాజు, అక్రం, రాజేకియాదవ్, డి. వెంకటయ్య, జగన్, అప్పగాళ్ల రమేశ్, తాహెర్, మోహిజ్, కుర్వ రమేశ్. చాకలి భాస్కర్, ఉవగుంట యాదయ్య, చాకలి నరేశ్, శివ, ముద్దం రాములు, సంద సురేశ్, ముద్దం ప్రవీణ్ యాదవ్, బంగ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.