యువత కాంగ్రెస్ పార్టీలో కీలకం కావాలి

నవతెలంగాణ-వీర్నపల్లి : వీర్నపల్లి మండల కేంద్రములో ‘కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్ అధ్వర్యంలో యూత్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి యువత మద్దతు పెద్ద స్థాయిలో ఉందని, రాబోయే రోజుల్లో యువ కాంగ్రెస్ ముందుకు దుసుకుపోతుందన్నారు.అనంతరం వీర్నపల్లి మండల ఇంచార్జ్ మాలోత్ రాంచందర్ నాయక్ మాట్లాడుతు యువకులు రాజకీయాల్లో కీలకంగా మారాలని, యువతకు సరైన వేదిక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని సూచించారు. ఈ కార్యక్రమములో ఎల్లారెడ్డిపేట మండల ఇంచార్జ్ మందాటి దేవేందర్ యాదవ్,వీర్నపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు పెడ్తనపెల్లి చంద్రమౌళి, నాయకులు పని శివ, లెంకల రాజు, సామల్ల సతీష్,లెంకల లక్ష్మణ్, జోగుల కాంతయ్య, నందగిరి శ్రీనివాస్, పర్మాల మల్లేశం, గంగాధరి దేవానందం , పేరం ప్రశాంత్,మండేపల్లి రవి,జోగుల కార్తిక్, దార్ల తిరుపతి గ్రామ యువకులు పాల్గొన్నారు.