అగ్నివీర్‌ ఎంపికకు యువత ముందుకు రావాలి

– జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
నవతెలంగాణ-సిద్దిపేట
ఎయిర్‌ ఫోర్సులో అగ్నివీర్‌ వాయుగా ఎంపికకు జిల్లా యువత ముందుకు రావాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ కోరారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌ జె డబ్ల్యూ ఓ ఆనంద్‌ గోస్వామి, ఎస్‌ జి టి రాజేష్‌ లు మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ లేదా దానికి తత్సమాన విద్యార్హత గల విద్యార్థులు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టులలో 50 శాతం మార్కులు గలవారు, తత్సమాన డిప్లమా కోర్సు పూర్తి చేసినవారు, 02 జనవరి 02, 2004 జూలై 02, 2007 మధ్య జన్మించిన యువతీ యువకులు అగ్నివేర్‌ వాయు ఎంపికకు ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ 17 నుండి ఫిబ్రవరి 6 వరకు చేసుకోవాలన్నారు. ఆన్‌ లైన్‌ పరీక్ష మార్చ్‌ 17న నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అగ్ని వీర్‌ వాయు కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. అంతకుముందు ఎయిర్‌ ఫోర్స్‌ కమాండర్‌ ఆనంద్‌ గోస్వామి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థులకు అగ్ని వీరి వాయుపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, మహేందర్‌ రెడ్డి, సూర్యప్రకాష్‌, సిద్దిపేట జిల్లా యువజన మరియు క్రీడల అధికారి జె.నాగేందర్‌ పాల్గొన్నారు.