– పర్యావరణ అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు, రామకష్ణారావు
నవతెలంగాణ-చేవెళ్ల
రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని పర్యావరణ అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు, రామకష్ణారావు అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజిఆర్ గార్డెన్‌లో గాంధీ ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి యువత చాలా మంది ముందుకు వచ్చి స్వతంత్రంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా 100 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో రక్తం అందుబాటులో లేక శస్త్ర చికిత్సల సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని దీని కారణంగా ప్రాణనష్టం సంభవిస్తోందని అన్నారు. వైద్యరంగం ఎంతో అభివద్ధి చెందినప్పటికీ రక్తాన్ని మాత్రం కత్రిమంగా తయారు చేయలేకపోయారని అన్నారు. రక్తదానం చేడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడినవారు అవుతారని అన్నారు. 18 ఏండ్లు నిండిన ఆరోగ్యవంతులెవరైనా రక్తదానం చేసేందుకు అర్హులని తెలిపారు. ఒకసారి రక్తదానం ఇచ్చిన తర్వాత తిరిగి మూన్నెళ్ల వరకు ఇవ్వొద్దని తెలిపారు. రక్తదానం చేయటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పేర్కొన్నారు. రక్తదానం అవయవదానం పట్ల ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సిన అవసరముందన్నారు. ఆ బాధ్యత విద్యార్థులు, యువత తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఏడాదిలో కనీసం రెండుసార్లు రక్తదానం చేయాలని అన్నారు. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న వారికి తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన యువతను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో గాంధీ ఆస్పత్రి మెడికల్ సిబ్బంది, టెక్నిషియన్ లు, ఆయా గ్రామాల యువకులు తదితరులు పాల్గొన్నారు.