యువత కొత్త ఆలోచనలు చేయాలి.. అద్భుతాలు సృష్టించాలి

– ఆర్ కె హాస్పిటల్ అధినేత చావ రాజ్ కుమార్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్ కె హాస్పిటల్ అధినేత డాక్టర్ చావా రాజ్ కుమార్  శనివారం రాత్రి యాదగిరిగుట్ట మండలంలోని దాతర్ పల్లి గ్రామంలో యంగ్ ఇండియా లీడర్షిప్ నిర్వహించగా, ఆయన ముఖ్యఅతిథిగా హాజరై,  మాట్లాడారు. ఎన్జీవో ఆర్గనైజేషన్ ఐదవ సమావేశం దాతర్ పల్లి లో నిర్వహించడం జరిగిందని, లీడ్ టుడే చేంజ్ టుమారో అనే లక్ష్యంతో యువత కాలంతో పాటు ఆలోచనలు మారాలని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి మీ ఆలోచన పంచుకునే ఇది ఒక వేదిక  అని అన్నారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అసిస్టెంట్ ప్రొఫెసర్  సుధగాని మహేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ డ్రగ్స్ ను అరికడదాం ఆరోగ్యంగా జీవిద్దాం అని పేర్కొన్నారు ముఖ్యఅతిథిగా విచ్చేసిన విద్యుత్ శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ బత్తిని  కృష్ణ మాట్లాడుతూ యువతలో తపన స్వశక్తి బలంగా ఉంటే విజయం సాధించవచ్చు  అని అన్నారు. ఈ  కార్యక్రమంలో వైస్ చైర్మన్ అంబోజు మల్లేశం, జాయింట్ సెక్రెటరీ  యేంపాల కొండల్ రెడ్డి, ట్రెజరీ వెంకట్ రాజు గౌడ్, జాయింట్ డైరెక్టర్ గాజుల వెంకటేష్ గౌడ్, శ్రవణ్ రెడ్డి, సంపత్ కుమార్ గౌడ్, శ్రవణ్ కుమార్, గ్రామ యువతీ యువకులు  పాల్గొన్నారు.