యువత రాజకీయాల్లోకి రావాలి

యువత రాజకీయాల్లోకి రావాలిసముద్ర మూవీస్‌ బ్యానర్‌ నుండి ‘రామ జన్మభూమి’ టీజర్‌ రిలీజ్‌ అయ్యింది, యువత రాజకీయాలలోకి రావాలి అనే కాన్సెప్ట్‌లో వచ్చిన ఈ టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వి. సముద్ర ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. కథకి తగ్గట్టుగా రవి శంకర్‌ మంచి మ్యూజిక్‌ని అందించారు. డైరెక్టర్‌ సముద్ర మాట్లాడుతూ,’ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. దేవుడే రాముడిగా వచ్చినా మానవుడిగా ధర్మ బద్దంగా బతికారు, ఒక దేశానికి రాజుగా, ఒక తండ్రికి మంచి బిడ్డగా, తమ్ముళ్ళకి అన్నగా ఇలా ధర్మ బద్ధంగా బతికి మనకి చూపించారు. ప్రతి పౌరుడు రాముడిలా బ్రతకాలి, ధర్మంగా మెలగాలని, రాజకీయాలలోకి యువత కచ్చితంగా రావాలి అనే సందేశంతో ఈ సినిమా చేస్తున్నాను’ అని చెప్పారు. ”సింహరాశి, శివ రామరాజు, టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌, సేవకుడు, పంచాక్షరీ, మహానంది’ లాంటి గొప్ప సినిమాలని అందించిన వి.సముద్ర దర్శకత్వంలో ఈ సినిమాతో నేను హీరోగా లాంచ్‌ అవ్వడం చాలా ఆనందంగా ఉంది’ అని హీరో జై సిద్ధార్థ్‌ అన్నారు.