అన్ని రంగాల్లో యువత రాణించాలి

– టీడీపీ మండల అధ్యక్షుడు మాసయ్య ముదిరాజ్‌, వీరాపూర్‌ సర్పంచ్‌ జనార్దన్‌ రెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల
యువత అన్ని రంగాల్లో రాణించాలని టీడీపీ మండల అధ్యక్షుడు మాసయ్య ముదిరాజ్‌, వీరాపూర్‌ సర్పంచ్‌ జనార్దన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం చౌడాపూర్‌ మండలం వీరాపూర్‌ గ్రామంలో క్రికెట్‌ టోర్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… క్రీడల్లో రాణిస్తే ప్రతి ఒక్కరికీ ఉత్తమ భవిష్యత్‌ ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు రవి, మూజీబ్‌,శేఖర్‌, ముదిరాజ్‌ సంగం అధ్యక్షులు క్రిష్ణా,పాండు, రవీందర్‌ రెడ్డి ,నిరంజన్‌,రమేష్‌ ప్రశాంత్‌ రెడ్డి, జంగీర్‌ బాబా నిరంజన్‌, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.