నవతెలంగాణ – పెద్దకోడాప్ గల్
మండలంలోని కాటేపల్లి గ్రామంలో బుధవారం నాడు కాటేపల్లి ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ని ఎస్ఐ మహేందర్, ఎంఈఓ ప్రవీణ్ కుమార్ కలిసి బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎస్సై మహేందర్ మాట్లాడుతు యువత విద్యతో పాటు క్రీడా రంగంలో మంచి నైపుణ్యత పొంది క్రీడా రంగంలో కూడా రాణించాలని గ్రామీణ ప్రాంత క్రీడలు ప్రతి ఒక్క క్రీడాకారులు చక్కటి ప్రదర్శన ఇచ్చి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీ ప్రదర్శనలు చూపి , భవిష్యత్తులో ఇలాంటి రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి పెద్దకోడప్ గల్ ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే , ఓడిపోయినా నిరుత్సాహం పడకూడదని గెలిచాము అని గర్వపడవద్దని స్నేహపూర్వకంగా క్రీడలను ఆడాలి. ఓడిపోయినా ఓటమి విజయానికి నాందిగా భావించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేందర్, ఎంఈఓ ప్రవీణ్ కుమార్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బాలరాజ్, పంచాయతీ సెక్రటరీ ప్రదీప్, గ్రామస్తులు మల్లప్ప పటేల్, ముగ్గుల గౌడ్, గ్రామస్తులు ఆయా ప్రాంతంలో క్రీడాకారులు పాల్గొన్నారు.