యువత క్రీడల్లో రాణించాలి..

Youth should excel in sports..– విజేతలకు బహుమతులు అందజేసిన దుద్దిల్ల శ్రీను బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు 
యువత క్రీడల్లో రాణించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీనుబాబు అన్నారు.శనివారం మండలంలోని  కిషన్ రావు పల్లి గ్రామములో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో విజేతగా నిలిచిన క్రీడాకారులకు   బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడారుక్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.క్రీడల వలన మానసిక ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందన్నారు.సాధ్యమైనంత వరకు ఎ క్రీడలోనైన రోజులో కొంత సమయం కేటాయిస్తే ఆరోగ్య వంతంగా జీవించవచ్చని తెలిపారు.యువకులు కేవలం చదువుతూనే కాకుండా క్రీడా రంగంలో కూడా  ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉందన్నారు. యువతి యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడా రంగంలో ముందుకు వెళ్ళాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, పెద్దతూoడ్ల గ్రామశాఖ అధ్యక్షుడు జక్కుల వెంకటస్వామి యాదవ్, అడ్వాలపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు అజ్మీరా రాజు నాయక్,కాంగ్రెస్ నాయకులు రాహుల్, అడ్వాల మహేష్,కొండ రాజమ్మ పాల్గొన్నారు.