యువత చదువుతోపాటు ఆటల్లో రాణించాలి

– కాటారం సబ్ డివిజన్ శ్రీపాద స్మారక క్రికెట్ టోర్నీ ప్రారంభంలో దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ –  మల్హర్ రావు
యువత చదువుతోపాటు ఆటల్లో రాణించాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు.కాటారం మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న శ్రీపాద స్మారక ఐదు మండలాల స్థాయి జిపిఎల్ -1 క్రికెట్ టోర్నమెంట్ ను టోర్నమెంట్ ప్రారంభించినట్లుగా యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడారు క్రీడల వలన మానసిక ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంది కావున అందరూ సాధ్యమైనంత వరకు ఈ క్రీడలో అయిన రోజులో కొంత సమయం కేటాయిస్తే ఆరోగ్య వంతంగా జీవించ వచ్చి అని తెలిపారు.యువకులు కేవలం చదువుతూనే కాకుండా క్రీడా రంగం లో కూడా  ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉందని అలాగే యువతి యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడా రంగం లో ముందుకు వెళ్ళాలని కోరారు.