నవతెలంగాణ-చివ్వేంల : నేటి యువత స్వయం ఉపాధితో ఎదగాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్ రెడ్డి, మన్నా చర్చ్ పాస్టర్ సామ్యేల్ అన్నారు. ఆదివారం చివ్వేంల మండల కేంద్రం లో లక్ష్మి కిరాణం &జనరల్ స్టోర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా, వ్యాపార రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో సురేష్, సునీత, లక్ష్మణ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.