యువత స్వయం ఉపాధి వైపు పయనించాలి

– కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ 
నవతెలంగాణ పెద్దవంగర: యువత స్వయం ఉపాధి వైపు పయనించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని అవుతాపురం గ్రామంలో శుక్రవారం బిస్మిల్లా చికెన్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో యువత ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ హోలిమియా, షరీఫ్, శాలివాహన సంఘం అధ్యక్షుడు పాలబిందెల సంపత్, ఉపాధ్యక్షుడు పగిడిపాల గోపాల్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాసోజు సోమా చారి తదితరులు పాల్గొన్నారు.