నవతెలంగాణ – సుల్తాన్ బజార్
యువత చెడు వ్యసనాలకు లకు బానిస కావద్దని, యువత చెడు అలవాట్లకు లోనుకావద్దని కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ నివేదిత అన్నారు. మంగళవారం కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో ఆమె మాట్లాడుతూ.. యువత గంజాయి, మత్తు పదార్థాల తో తమ జీవితాన్ని ఆగం చేసుకోవద్దని సూచించారు. యువత డ్రగ్ స్ వాడకంతో ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తాయన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకర ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. మంచి దారిలో నడిచి జీవితంలో విజయం సాధించాలని అన్నారు. డ్రగ్స్ వాడకంతో కుటుంబాలకే కాకుండా సమాజానికి తీవ్ర నష్టమని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారిని గమనిస్తుండాలని సూచించారు. డ్రగ్స్ వాడకంతో ఆరోగ్యపరంగా, ఆర్థిక, సామాజిక పరంగా ఎన్నో దుష్పరిణామాలు ఉంటాయని అన్నారు. డ్రగ్స్ వినియోగం, రవాణా గురించి తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 14416కు సమాచారం ఇవ్వాలని సూచించారు.విద్యార్థులు పాజిటివ్ ఆలోచనలతో చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆసియా, డాక్టర్ ద్రీశ్య తదితరులు పాల్గొన్నారు.