– తెలంగాణ యువజన విభాగం అధ్యక్షులు శివసేనరెడ్డి
నవ తెలంగాణ-జక్రాన్ పల్లి :
యువజనులు కాంగ్రెస్ పార్టీ గెలుపులకు ముఖ్యపాత్ర పోషించాలని తెలంగాణ యువజన విభాగం అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. ఆర్మూర్ లో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో భాగంగా తెలంగాణ యువజన విభాగం అధ్యక్షులు శివసేన రెడ్డి ని రమ్మూర్తి గోపి ని జక్రంన్ పల్లి యువజన విభాగం నాయకులు జక్రాన్ పల్లి మండల యువజన విభాగం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లలో యువకులు కష్టపడి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ముఖ్య పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జక్రాన్ పల్లి మండల యువజన విభాగం అధ్యక్షుడు సొప్పరి వినోద్ ఉపాధ్యక్షులు ప్రణయ్ సుప్పరి చింటూ సుధీర్ తదితరులు ఉన్నారు.