– సీఐ వెంకటేశ్వర్లు
– డ్రగ్స్ రహిత సమాజానికి
– ప్రతి ఒక్కరూ కషి చేయాలి
నవతెలంగాణ-మహేశ్వరం
మత్తు పదార్థాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సీఐ వెంక టేశ్వ ర్లు తెలిపారు. మంగళవారం మనసాన్‌పల్లి చౌరస్తాలో డ్రగ్స్ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కషి చేయాలని ఆయన సూచించారు. ప్రజలు డ్రగ్స్‌పైన ఏమైనా అనుమానాలుంటే సమాచారం అందించాలని ఆ యన సూచించారు. డ్రగ్స్ మహమ్మారి రోజురోజుకూ విజృంబిస్తుండడంతో అయన ఆందోళన వ్యక్తపరిచారు. ప్రజలు డ్రగ్స్ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని ఆయన సూచించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లి దండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం లో ఎస్‌ఐ వెంకట్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.