యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..

Youth should stay away from drugs.నవతెలంగాణ – జన్నారం
యువత,విద్యార్థుల మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సమాజానికి దగ్గరగా ఉండాలని జన్నారం మండల  సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్  రాజ వర్ధన్ అన్నారు. శనివారం “నవతరం స్టూడెంట్ ఫెడరేషన్(NSF)” రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రామ్ ప్రసాద్ పటేల్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రూపొందించిన జంగ్ సైరన్ వాల్ పోస్టర్లను ఎస్సైై   రాజ వర్ధన్  చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సంధర్భంగా వారు  మాట్లాడుతూ.. కొంత మంది యువత,విద్యార్థులు కిక్కు కోసమో,ధ్రిల్ కోసమో దమ్ము కొట్టడం,మందు కొట్టడం లాంటివి ప్రారంభించి క్రమంగా అవి ఒదులుకోలేని వ్యసనాలుగా వారికి మారుతున్నాయని అన్నారు. కొందరు ఆకతాయిలు చేసే అలవాట్ల వల్ల యువత తమ భవిష్యత్ ని నాశనం చేసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కి అలవాటైన యువత సమాజానికి దూరం అయ్యే ప్రమాదం ఉందని, తమ సన్నిహితులు తమ వద్దకు రావాలన్న కూడా జంకే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. యువత డ్రగ్స్ కి దూరంగా ఉండి సమాజానికి దగ్గరగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ కి దూరంగా ఉందాం, సమాజంతో దగ్గరగా ఉందాం అనే స్లోగన్ తో  నవతరంం స్టూడెంట్  విద్యార్థి సంఘం జంగ్ సైరన్ అనే కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం అన్నారు. యువత, వారి తల్లిదండ్రులు కూడా డ్రగ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరదా కోసం చేసుకునే చిన్న చిన్న అలావట్లే రేపటి రోజున మీ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టేయొచ్చని,నీకు భవిష్యత్ లేకుండా చెయ్యొచ్చు, నీ కుటుంబంతో నువ్వు సమయాన్ని గడపకుండా చేయొచ్చు అని, అదే విధంగా డ్రగ్స్ తీసుకున్న వాటిని సరఫరా చేసిన మరియు వాటిని ప్రోత్సహించిన కూడా కఠిన శిక్షలు ఉంటాయన్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండి, మీకు మీ చుట్టూ ప్రక్కల డ్రగ్స్ ఉన్నట్టు ఎలాంటి అనుమానం ఉన్న కూడా పోలీస్ శాఖ వారికి సమాచారం అందించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  నవతరం స్టూడెంట్ ఫెడరేషన్  నాయకులు ఈశ్వర్, హత్తిరామ్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.